Monday, November 26, 2007



ప్రతి మనిషికీ ఒక
ఆశయమంటూ ఉండాలి. అది ఉన్నతమైనదై ఉండాలి. అది శరీరానికి రాసుకున్న సుగంధద్రవ్యంలా
కృత్రిమమైనది, తెచ్చిపెట్టుకుంటే వచ్చేదిగా కాక, పూవు పుట్టగానే వచ్చే పరిమళంలా
సహజసిద్ధమైనదై ఉండాలి. అప్పుడే ఆ ఆశయం సిద్ధిస్తుంది. ఆ విషయంలో విజయం
చేకూరుతుంది.